హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోయలో పడిన ఆటో.. ఒకరు మృతి

అనకాపల్లి: గొలుగొండ మండలం తాండవ జోగంపేట రోడ్డులో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. తాండవ డ్యామ్ కొండ ఎక్కుతుండగా బ్రేకులు ఫెయిలై పది మందితో వెళ్తున్న ఆటో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.