హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిచ్చికుక్క స్వైరవిహారం.. 11 మందికి గాయాలు

E.G: మర్రిపూడిలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ గ్రామస్తులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుక్కల బెడద నివారించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.