హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉదయగిరిలో దొంగ నోటు కలకలం

NLR: ఉదయగిరిలోని ఓ సూపర్ మార్కెట్‌లో రూ.500 నకిలీ నోటు వెలుగుచూసింది. బ్యాంకులో నగదు డిపాజిట్ చేసే సమయంలో సిబ్బంది దాన్ని గుర్తించి చించివేశారు. రద్దీ ప్రాంతాల్లో నకిలీ నోట్లు చెలామణి అవుతున్నట్లు అనుమానిస్తున్నారు. వ్యాపారులు నగదు స్వీకరించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.