హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల తీర్పు కూటమి వైపే: ఎమ్మెల్యే దగ్గుపాటి

ATP: ఈవీఎంలైనా, బ్యాలెట్లయినా ప్రజల తీర్పు కూటమి వైపే ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్, జనసేన నగర అధ్యక్షుడు బాబురావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. 95 శాతానికి పైగా స్థానిక సంస్థల్లో కూటమి విజయం సాధించిందని చెప్పారు.