KKD: కాజులూరు – తాళ్లరేవు రహదారిపై ఒంటి తాడి శివారు శీలలంక వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో వారు పక్కనే ఉన్న పంటకాలువలో పడిపోయారు. నీట మునిగి ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై సీఐ చైతన్య కృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తు తెలియని వాహనం ఢీ.. ఒకరు మృతి


