హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కాపురం బీసీ హాస్టల్లో విద్యార్థిపై దాడి

మార్కాపురం బీసీ వసతి గృహంలో 9వ తరగతి విద్యార్థి సందీప్‌పై శానిటేషన్ ఉద్యోగి కర్రతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. విద్యార్థులు అల్లరి చేస్తున్నారనే కారణంతో ఉద్యోగి మంత్రు నాయక్ కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. విషయం తెలుసుకున్న ఆర్డీవో శివరామిరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి హాస్టల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు.