హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

ప్రకాశం: రాచర్ల మండలం రంగారెడ్డిపల్లి సమీపంలోని అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో లల్లితమ్మ అనే వృద్ధురాలు మృతిచెందింది. కొమరోలు మండలం అలసందలపల్లికి చెందిన ఆమె ఓ యువకుడి ద్విచక్ర వాహనంపై గిద్దలూరుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడింది. తీవ్ర గాయాలతో మృతిచెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.