హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన 50 కుటుంబాలు

మన్యం: నర్సిపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరాయి. గ్రామానికి చెందిన చెరుకుబిల్లి గంగరాజు ఆధ్వర్యంలో పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్వతీపురంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.