హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంతర్‌ కళాశాల క్రీడా పోటీల్లో జీపీవీకి ప్రథమ స్థానం

విశాఖ: ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో నిర్వహించిన అంతర్‌ కళాశాల క్రీడా పోటీల్లో గాయత్రి విద్యా పరిషత్‌ (జీవీపీ) కళాశాల ప్రథమ స్థానం సాధించింది. ఏసీటీఎస్‌ కళాశాల ద్వితీయ, ఏయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ తృతీయ స్థానాల్లో నిలిచాయి. సుమారు 12 ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్‌ విశ్వవిద్యాలయ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేశారు.