హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

SS: కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలలోని 12 మండలాల్లో రెండవ రోజు పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్ కేంద్రాల వద్ద బారికేడ్లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోకి అనధికార వ్యక్తులు, వాహనాలను అనుమతించడం లేదు. పరిసరాల్లో డ్రోన్, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచారు.