హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. డిగ్రీ పరీక్షలు వాయిదా

SKLM: అక్వాన్ తుఫాను కారణంగా గురువారం జిల్లాలో జరగవలసిన అన్ని పరీక్షలు , డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేసినట్లు అంబేద్కర్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. వాయిదా పడిన ఈ పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలోనే తెలియజేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. కావున విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్స్ ఈ విషయాన్ని గమనించగలరు కోరారు.