హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కిందపడి వ్యక్తి మృతి

కోనసీమ: కె.గంగవరం కోసం ఎర్రపోతవరం వంతెన వద్ద గురువారం ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. యానాం నుంచి రామచంద్రపురం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో అద్దంపల్లికి చెందిన వాసా సత్యనారాయణ భార్యతో కలిసి ప్రయాణిస్తున్నారు. బస్సు నుంచి జారిపడటంతో వెనక చక్రాలు మీదుగా వెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు