NDL: సంజామల మండలం పేరుసోములలో వ్యవసాయ అధికారి భూమా జ్యోతి ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు భూసార పరిరక్షణ, సేంద్రియ ఎరువుల వినియోగం, నీటి పొదుపు, పంట మార్పిడి, చీడపీడల నివారణ, ఆధునిక సాగుపై అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆధునిక సాగుపై రైతులకు అవగాహన: ఏవో


