హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుఫాను హెచ్చరికలతో పంటల కోతలో రైతులు బిజీ

అల్లూరి: అక్వాన్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అల్లూరి జిల్లా గిరిజన రైతులు అప్రమత్తమయ్యారు. కోతకు సిద్ధమైన వరి, సామ, చోడి పంటలను బుధవారం నుంచి కోస్తూ నూర్పిడి చేస్తున్నారు. అరకులోయ మండలం, పద్మాపురం పంచాయతీ, పింపలగుడ గ్రామ రైతులు యంత్రాలతో వరి నూర్పిడి వేగవంతం చేశారు. వర్షాలకు పంట నష్టపోకుండా ధాన్యాన్ని సురక్షితంగా చేర్చుకునేందుకు రైతులు శ్రమిస్తున్నారు.