హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సీపట్నంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి

అనకాపల్లి: నర్సీపట్నంలో ఇందిరా గాంధీ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు నంగిన రమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు సుబ్బన్న ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ అభివృద్ధి, పేదల సంక్షేమం, జాతీయ సమగ్రత కోసం ఇందిరా గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో బొంతు రమణ పాల్గొన్నారు.