హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోరుమామిళ్లలో ఊపందుకున్న పంచాయతీ ప్రచారం

KDP: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పోరుమామిళ్ల పంచాయతీ వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి షేక్ అర్షియాకు మద్దతుగా దేవసాని ఆదిత్య రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాసవి నగర్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వీధుల్లో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. వైసీపీ అభ్యర్థిని భారీ మెజారిటీతె గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.