ADB: కేంద్ర ఆర్థిక సేవల శాఖ ఆర్థిక చేరిక కార్యక్రమంలో భాగంగా గుడిహత్నూర్ మండలం తోషం తండాలో సర్పంచ్ జితేందర్ ఆధ్వర్యంలో సంతృప్త శిబిరం నిర్వహించారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు, అర్హులకు సామాజిక భద్రత పథకాల లబ్ధి, ఆర్థిక అక్షరాస్యత లక్ష్యమని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉత్పల్ కుమార్ ధామ్ తెలిపారు. క్లెయిమ్ చేయని డిపాజిట్లను వారసులు తిరిగి పొందే విధానాన్నీ వివరించారు.


