MBNR: జడ్చర్ల బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ రకం వడ్లకు క్వింటాల్‌కు రికార్డు స్థాయిలో రూ.3,969 ధర పలికింది. కనిష్ఠ ధర రూ.2,209. మొత్తం 12,320 క్వింటాళ్ల వడ్లు మార్కెట్‌కు వచ్చాయి. మొక్కజొన్న రూ.2,980–3,182, వేరుశనగ రూ.5,525–9,141, పత్తి రూ.8,789–9,219 మధ్య అమ్ముడైనట్టు మార్కెట్ కార్యదర్శి తెలిపారు.
తెలంగాణ
బాదేపల్లిలో వడ్లకు రికార్డు ధర


