SRD: సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ కమిటీ ఛైర్మన్ కొక్కొండ శ్రీశైలం గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమం జరిగింది. గురుస్వాములు అయ్యప్పను కీర్తిస్తూ పాటలు పాడారు. అనంతరం పడి వెలిగించి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణ
అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ


