MHBD: బయ్యారం మండల కేంద్రంలో ఈరోజు ఉదయం మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బయ్యారం మేజర్ జీపి సర్పంచ్ గుగులోత్ శాంతి, కిషన్ నాయక్ పాల్గొన్నారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆమె సేవలను కొనియాడారు.
తెలంగాణ
ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు


