హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రంగులు మార్చే అరుదైన మందారం

ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో రంగులు మారే అరుదైన మందార చెట్టు ఆకట్టుకుంటోంది. చేంజబుల్ రోజ్ (హిబిస్కస్ ముటాబిలిస్) రకానికి చెందిన ఈ చెట్టుపై పూలు ఉదయం తెలుపు రంగులో వికసించి, మధ్యాహ్నానికి లేత గులాబీ, సాయంత్రానికి ఎరుపు రంగులోకి మారుతున్నాయి. సూర్యరశ్మి, ఉష్ణోగ్రతల ప్రభావంతో రంగులు మారుతుండటంతో ఈ వింతను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.