MDK: మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో నేడు ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఒకటో వార్డులో గల ఇందిరమ్మ విగ్రహానికి పట్టణ అధ్యక్షుడు చింతల స్వప్న స్వామి ఆధ్వర్యంలో మున్సిపల్ ఛైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఇందిరా గాంధీ అందించిన సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ
రామాయంపేటలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు


