హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికల హైస్కూల్‌లో ఆత్మరక్షణపై అవగాహన

MDK: తూప్రాన్ పట్టణంలో బాలికల హైస్కూల్‌లో షీ టీం పోలీసులు విద్యార్థినులకు ఆత్మరక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థినులు ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ, ఆపద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించడం, వ్యక్తిగత భద్రతపై అవగాహన ఎంతో అవసరమని వివరించారు.