PLD: రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా ఆదేశాల మేరకు, నేడు జరగాల్సిన మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక వాయిదా పడినట్లు, నాదెండ్ల ప్రిసైడింగ్ అధికారిణి నాగమల్లేశ్వరి తెలిపారు. అయితే మధ్యాహ్నం 1:00 గంటకు ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం, 3:00 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఉత్తర్వుల తర్వాతే కో-ఆప్షన్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నాదెండ్ల మండల పరిషత్ కో-ఆప్షన్ ఎన్నిక వాయిదా


