హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా రాములవారి నిత్య కళ్యాణం

BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం నిత్యకల్యాణ వేడుక వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులను నిత్య కల్యాణ మండపంలో కొలువు తీర్చి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి, అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ తంతును కనులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయం రామ నామ స్మరణతో మార్మోగింది.