WG: ఉండి మండలంలోని పంట కాలువ కాలుష్య కాసారంగా మారిపోయింది. మహాదేవపట్నం సమీపంలో ఉండి పంట కాలువ పరిస్థితి అత్యంత దారుణంగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస తుఫాన్లుతో కాలువలో కూలిపోయిన వృక్షాలతో పాటు జంతు కళేబరాలు కొట్టుకొచ్చి ఆగిపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని చెబుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పంట కాలువలో వ్యర్ధాలను తొలగించరా?


