హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌‌లో పసుపుకు రికార్డు ధర!

NZB: వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు క్వింటాల్‌కు రికార్డు స్థాయిలో రూ.28 వేలు పలికింది. మే వరకు రూ.15 వేల వద్ద ఉన్న ధర గల్ఫ్ దేశాలు, బంగ్లాదేశ్, మలేసియా నుంచి ఎగుమతి ఆర్డర్లు పెరగడంతో ఎగబాకింది. జనవరి–మే సీజన్‌లో 75 శాతం రైతులు అమ్ముకోగా, నిల్వ ఉంచిన వారికి లాభం దక్కింది. కోల్‌కతా, చెన్నై ఎగుమతిదారులు రోజుకు దాదాపు వెయ్యి క్వింటాళ్లు తరలిస్తున్నారు.