హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు చిలకలూరిపేట ఎంపీపీ ప్రమాణ స్వీకారోత్సవం

PLD: చిలకలూరిపేట మండల పరిషత్ అధ్యక్షులుగా (ఎంపీపీ) జవ్వాజి అన్నపూర్ణ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును కోరారు. మండల అధ్యక్షులు జవ్వాజి మదన్ మోహన్, ఎంపీటీసీలు, నాయకులు కలిసి ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.