హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు ఎన్నికల అవగాహన పోటీలు

NZB: ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలను ఐడీవోసీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన సుమారు 120 మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏర్పాట్లను పరిశీలించి, పోటీలు పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. భవిష్యత్ ఓటర్లలో ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంచడమే లక్ష్యమని తెలిపారు.