MLG: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ గురువారం హైదరాబాద్లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ తొలి మహిళా ప్రధానిగా ఆమె అందించిన సేవలను స్మరించుకున్నారు. మహిళా సాధికారత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఇందిరాగాంధీ చేసిన కృషిని కొనియాడారు. నిరంతరం పేదలకు ఇందిరా గాంధీ పాలనలో మాత్రమే న్యాయం జరిగిందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఇందిరా గాంధీకి మంత్రుల నివాళులు


