NLG: చందనపల్లిలో నిర్మించిన పశువైద్యశాల నిరుపయోగంగా మారింది. ఉదయ సముద్రం రిజర్వాయర్ విస్తరణలో భాగంగా నూతన గ్రామానికి ప్రజలను తరలించే సమయంలో ఈ భవనాన్ని నిర్మించారు. అయితే ఇప్పటివరకు సిబ్బందిని నియమించకపోవడంతో పశువులకు వైద్యం అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.
తెలంగాణ
నిరుపయోగంగా చందనపల్లి పశువైద్యశాల


