హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ముగ్గురు ఖైదీలు పరార్

ప్రకాశం: ఒంగోలు రైల్వే స్టేషన్‌లో పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు అండర్ ట్రయల్ ఖైదీలు బుధవారం రాత్రి పరారయ్యారు. మధ్య ప్రదేశ్‌కు చెందిన సంతోశ్ బూరియా (24), భూరు మాక్స్వానా (40), రమేశ్ మర్చార్ (19)లను చీరాల కోర్టులో హాజరుపరిచి, తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు తీసుకొస్తుండగా ఒంగోలు స్టేషన్‌లోని 5వ ప్లాట్ఫామ్‌పై నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు.