హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక గురువారం వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే

BDK: భద్రాచలం కార్తీక మాసం గురువారం సందర్భంగా భద్రాచలంలోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరాన్ని మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య సందర్శించారు. సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ఆశీస్సులు అందజేశారు. అనంతరం ఘనంగా సన్మానించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని ప్రార్థించినట్లు ఆయన వెల్లడించారు.