హైదరాబాద్: 28°C
తెలంగాణ

గద్దర్ పాటలపై రాజకీయ చర్చ!

నల్గొండకు చెందిన ప్రముఖ గాయకుడు కాసర్ల నర్సిరెడ్డి (నల్గొండ గద్దర్) వ్యవహారం చర్చనీయాంశమైంది. గతంలో కమ్యూనిస్టులను విమర్శిస్తూ ‘మదమెక్కిన కమ్యూనిస్టులు’ అంటూ పాట పాడిన ఆయన, తాజాగా నల్గొండలో జరిగిన ఏఐకేఎస్ జాతీయ సభలో కమ్యూనిస్టులకు మద్దతుగా పాటలు పాడారు. దీంతో గతంలో చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుత వైఖరిని పోల్చుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.