హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయంగా రఘునాథపల్లి-కంచనపల్లి రహదారి

JN: రఘునాథపల్లి నుంచి కంచనపల్లికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారి ప్రమాదకరంగా తయారైంది. రోడ్డుపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ప్రమాదాల భయంతో ఆందోళన చెందుతున్నారు. రహదారి దుస్థితిపై ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరారు.