హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదివాసీ మహిళా సంఘం కమిటీ ఎన్నిక

భూపాలపల్లి జిల్లా నస్తూరిపల్లిలో ఆదివాసీ మహిళా సంఘం నూతన కమిటీని జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షురాలిగా పొలం రాజక్క, ప్రధాన కార్యదర్శిగా కాలినేని వనిత, ఉపాధ్యక్షురాలిగా గావిడి మల్లక్కతో పాటు ఇతర సభ్యులు ఎన్నికయ్యారు. పోడు పట్టాలు, ఇళ్లు, మౌలిక వసతుల కోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం వీరిని ఘనంగా సన్మానించారు.