హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచే ‘ఇందిరమ్మ బీమా’..!

KMM: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానుంది. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారిలో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. లబ్ధిదారుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 11 లక్షల కుటుంబాలు అర్హులుగా ఉన్నట్లు అంచనా.