హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు లేఔట్ల క్రమబద్ధీకరణకు మేళ

ATP: గుత్తి పట్టణంలోని లే అవుట్ల క్రమబద్ధీకరణ, భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 20న మున్సిపల్ కార్యాలయంలో మేళా నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సురేంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లే అవుట్ల క్రమబద్దీకరణతో పాటు భవనాల నిర్మాణాలకు త్వరతిగతిన అనుమతులు ఇస్తామన్నారు. ఈ మేళాకు దరఖాస్తు చేసుకున్న యజమానులు వినియోగించుకోవాలన్నారు.