హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నేరావుపేట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

NTR: రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట ఫారెస్ట్‌లోకి అర్ధరాత్రి పెద్దపులి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. రమణక్కపేట నుంచి రహదారి దాటుతూ సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణించినట్లు గుర్తించారు. ప్రస్తుతం రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి కదలికలను ట్రాక్ చేస్తున్నామని తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒంటరిగా ఎవరూ పొలాలకు వెళ్లొద్దని సూచించారు.