NTR: విస్సన్నపేట మండలం నాయకులగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. గ్రామానికి చెందిన యామవరపు రమేష్ అయ్యప్ప ధారణలో హఠాన్మరణం చెందారు. ఆయన శబరిమలైలో మెట్లు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. రమేష్ మరణవార్త విని మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఆంధ్రప్రదేశ్
శబరిమలైలో NTR జిల్లా వాసి మృతి


