హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: డంప్ యార్డ్‌లో చెత్తకు మంటలు

KRNL: ఆదోని బైపాస్ సమీపంలోని డంప్ యార్డ్‌లో మున్సిపల్ చెత్తకు మంటలు వ్యాపించాయి. సమీపంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద చెత్త వేయొద్దని పలుమార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యుత్ శాఖ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.