హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు MPPగా లలిత..!

నెల్లూరు రూరల్ MPP, వైస్ MPP పదవులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీపీ పదవిని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఆమంచర్ల-1 ఎంపీటీసీగా గెలుపొందిన యాకసిరి లలితను ఎంపీపీగా నిర్ణయించారు. దేవరపాలెం ఎంపీటీసీ వేమిరెడ్డి సురేంద్రను వైస్ ఎంపీపీగా ప్రకటించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక జరగనుంది.