హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తణుకు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తా : బలరామకృష్ణ

WG: తణుకులో వైసీపీ చైర్మన్ అభ్యర్థి యిండుగపల్లి బలరామకృష్ణ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం తణుకు డిగ్రీ కళాశాల ఆవరణలో వాకర్స్ సభ్యులతో సమావేశమై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. తాను మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైతే తణుకు పురపాలక సంఘాన్ని అభివృద్ధి చేస్తానని బలరామకృష్ణ హామీ ఇచ్చారు.