హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు

KRNL: ఓటరు జాబితా ప్రాముఖ్యత, ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమాన్ని డీఆర్వో రాము నాయక్ నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.