హైదరాబాద్: 28°C
వార్తలు

పట్టపగలే రూ.40 కోట్ల నగలు చోరీ

బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియాలోని ఓ బంగారు నగల దుకాణంలోకి చొరబడిన ఎనిమిది మంది దుండగులు సుమారు రూ.40 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లారు. మూడు బైక్‌లపై వచ్చిన దుండగులు తొలుత కస్టమర్ల మాదిరిగా షోరూమ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆయుధాలతో బెదిరించి బంగారం, వజ్రాభరణాలతో పరారయ్యారు.