హైదరాబాద్: 28°C
వార్తలు

విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

తమిళనాడులోని కరూరులో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వేలాయుధంపాళయం గ్రామంలో భార్యాభర్తలు ప్రభు, సుగుణ మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే సుగుణ తన కుమార్తె శివాని(10), కుమారుడు అదిరన్(4)ను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. సుగుణ, ఆమె పిల్లలు, ఆమె తల్లిదండ్రులు రామస్వామి(63), జానకి స్థానిక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.