హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం

ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం చోటుచేసుకుంది. టికెట్, సరైన గుర్తింపు పత్రాలు లేకుండానే ఓ యువకుడు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. టెర్మినల్-3 గేటు వద్ద అతడిని గుర్తించిన CISF జవాన్లు వెంటనే అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.