హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయాధికారులకు నగదు రహిత వైద్య సేవలు

KRNL: జ్యుడీషియల్ అధికారుల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ పోస్టర్లను అదనపు జిల్లా జడ్జి పీ. వాసు బుధవారం ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా న్యాయమూర్తులు, న్యాయాధికారులు, వారి కుటుంబ సభ్యులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందనున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి, న్యాయమూర్తులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.