హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మన్యం జిల్లాలో తుఫాన్ ఈదురు గాలులు

మన్యం: అక్వాన్ తుఫాన్ ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. కొమరాడ, సోమినాయుడు వలస, గంగరేగువలస గ్రామాల్లో గురువారం ఉదయం మేఘాలు కమ్ముకుని గాలులు వీస్తున్నాయి. వర్షం పడనప్పటికీ మేఘాలు కమ్ముకున్నాయి. నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసింది.