NDL: శ్రీశైల దేవస్థానం కల్యాణకట్టను ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు బుధవారం తనిఖీ చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరచాలని, కేశఖండనకు ఎక్కువసేపు వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. భక్తులతో మర్యాదగా మెలగుతూ.. సమయపాలన పాటించాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి'


